జీవి పుట్టుకలోనే సంఘర్షణ ఉంది. జీవించడానికి సంఘర్షణ చేయాలి. సృష్టికార్యమే మహా సంఘర్షణ, సంఘర్షణ నుండే అన్ని శక్తులు పుట్టాయి. పుడ్తాయికూడా, ఇది అతి సహజమైన సృష్టి విభాగం. అందులో నుండే అనేక విలువిద్యలు, కత్తియుద్ధాలు, మార్షల్ ఆర్ట్స్, అనేక ఆధునిక ఆయుధాలు, యుద్ధ రీతులు పుట్టాయి. ఒక నాడు ఆత్మసంరక్షణలో, ఆహారపు వేటలో మానవులు అవసరరీత్యా నేర్చుకున్న విద్యలు కాలక్రమేణా వినోదభరితంగా ప్రజలను రంజింపచేయడానికి ప్రదర్శనలయ్యాయి. అయితే ఈరోజు సినిమా, టీవీలు అటువంటి వినోద ప్రదర్శనలకు కౄరమైన హింసాత్మక రూపురేఖలు దిద్ది సంఘంలో భయానక వాతావరణం నెలకొల్పుతున్నాయి. ముఖ్యంఆ యువతలో కౄర మనస్థత్వాన్ని పెంచిపోషిస్తూ మానవ విలువలను ధ్వంసం చేస్తున్నాయి.
మనవిధి : మేధావులు, సంఘ సంస్కర్తలు, అందరూ కలిసి సదవగాహన ఈ సంఘంలో పెంపొందించాలి. ఈ సినిమా, టీవీలపై ధ్వజమెత్తాలి.