మానవ వికాసం, ఆహార ఉత్పత్తుల, రవాణా సౌకర్యాలు పెరిగే కొద్దీ వ్యాపారం మానవ జీవితంలో అతి ప్రధాన భాగమైనది. అసలు ఆదిలో మానవుడు మానవుడి మధ్య వ్యాపారి ఒక ప్రాంతం నుండి మరోప్రాంతానికి పెరుగుతున్న సంస్కృతీ, సాంప్రదాయాలు, ఆహార ఉత్పత్తులు అందరికి అందుబాటులోనికి తెచ్చి సంస్కృతీ, సంపదల మార్పిడికి దోహదపడ్డారు వ్యాపారి. మానవీయ విలువలు పెరిగి సంఘం వికాసానికి తోడ్పడ్డారు. వస్తు మార్పిడి విధానంతో మొదలైన వ్యాపారి ధర్మం డబ్బుని సృష్టించి వక్రమార్గంపట్టి క్రమేపి మానవునిలో స్వార్ధం అంకురించడానికి తోడ్పడింది. వ్యాపారం యుద్ధాలకు మూలమైంది. సమాజపు సమూల నిర్మూలనకు నడుంబిగించే వరకు ఈనాడు చేరింది. ఆధునిక సినిమా, టీవీలు పత్రికారంగం దుష్ట వ్యాపారంలో కూరుకు పోయి ఆ డబ్బు అనే జబ్బుపట్టి సంఘ వినాశనానికి చేయగలిగిందంతా చేస్తున్నాయి. అన్ని విలువలు తుంగలో తొక్కబడ్డాయి బ్లాక్ మార్కెట్, స్టాక్ ఎక్సేంజీల మాయాజాలానికి మానవునిబ్రతుకు బలై పోయింది. ఈ నాటి మార్కెట్ ఎకానమీ, గ్లోబలైజేషన్, మత దురహంకారుల్ని దొంగవ్యాపారుల్ని, హవాలాన్ని, ప్రోత్సహిస్తూ సంఘం పతనాన్ని ప్రపంచ నాశనాన్ని కోరుతుంది నేటి వ్యాపారం.
మన కర్తవ్యం : అందరం మానవత్వం వైపు దృష్టిసారించి ఈ మార్కెట్ ఎకానమీ, గ్లోబలైజేషన్ బారి నుంచి కాపాడడానికి నడుబిగించాలి. ముందు సినిమా, టీవీ .,పత్రికా మీడియాలను సంస్కరించాలి.