శిశుర్వేత్తి : పశుర్వేత్తి,వేత్తి ఫణి రసం గానం అనే ఆర్యోక్తి అక్షరాల నిజం. సంగీతం ముందు పుట్టిందా ? సృష్టి ముందు పుట్టిందా ?అనే ప్రశ్న మనముందునిలిస్తే సంగీతం అడుగడునా ఊతమై నిలిచిందనేది సత్యం. మానవుడికి నడక నేర్పింది సంగీతం, మాట నేర్పింది సంగీతం, మాటను పాటగా మార్చింది సంగీతం సంగీతానికి మరణం లేదు. ఆ పరిస్థితే వస్తే సృష్టి అంతరించుపోతుంది. అయితే ఈ ఆధునిక మానవుల నాడు సృష్టిని ప్రకృతిని ధ్వంసం చేస్తున్నట్లే సంగీతాన్ని కూడా సాహితీలయుల తప్పించి చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంఘం కుళ్లిపోవడానికి సినిమా ప్రధాన భూమిక నిర్వహిస్తోంది. సినిమా అన్ని విధాలా ప్రధానంగా నిలుస్తోంది.
తక్షణ కర్తవ్యం : శబ్ద కాలుష్యంతో పాటు నేటి దుర్భర వికటకవిగత సంగీతపుహోరుకూడా తోడు చేసి భీభత్సాన్ని సృష్టిస్తున్న మానవుల ముందుకు సాగకుండా ప్రపంచ వ్యాపితంగా తీవ్ర ప్రయత్నం జరగాలి అందులో భాగంగా మా ప్రగతి ప్రచార్ కొత్త అడుగులు వేయాలని సంకల్పించింది. అందరం పూనుకోవాలి