PRAGATI PRACHAR TV
ప్రగతి ప్రచార్ టీవీ
ప్రజా టీవీ Flash News 4       **       ప్రజా టీవీ Flash News 3             **       ప్రజా టీవీ Flash News 2       **             ప్రజా టీవీ Flash News 1          **
జీవితం - నాటకం - సినిమా

కావ్యేషు : నాటకం రమ్యం అన్నాడు మహాకవి కాళిదాసు.

ప్రధాన కారణాలు : దృశ్య ప్రాధాన్యత, సాహిత్యం, సంగీతం, నాట్యం, వాచ్యం శిల్పం, యుద్ధం వేటికవే విడివిడిగా ఉంటాయి. అవన్ని నాటకంలో యిమిడిపోతాయి. అలా అన్నింటిని కలుపుకొని పారే నదీ ప్రవాహం వంటిది నాటకం. ప్రపంచవ్యాపితంగా మానవ జీవన సమకాలీన సంఘటనలకు దర్పణంపడ్తూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందినాటకం. మానవ సంస్కృతికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగింది. అది ఒక సజీవన ప్రక్రియ.

ఈ నాటి కర్తవ్యం : సినిమా, టీవిలు వచ్చిఅంతోయింతో నాటకాన్ని వెనక్కు నెట్టే ప్రయత్నం జరిగింది. అయితే పాశ్చాత్య దేశాలలో నాటకం ముందుకు సాగుతూనే ఉంది. కానీ మన దేశంలో ఆదరణ తగ్గిపోతుంది. అతి ముఖ్యంగా ఆంధ్రదేశంలో అడుగింటి పోతూఉందిగుడ్డిలో మొల్లలా మన రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు ప్రారంభించడంతో కొంత నూతనోత్సాహం కనపడ్తుంది. అయినా ప్రజలు, నాయకులు, అధికారగణం ప్రభుత్వం సమిష్టి భాద్యతగా తీసుకొని మళ్ళీ ముందుకు నడిపితే ఈ నాటి కుళ్లిపోయిన సంఘంలో కొంత కొత్త ఆలోచన పుడుతుంది. మా నమ్మకం. సినిమా, టీవీ కూడా సంస్కరించబడుతుందనేది మా ఆశ కూడా.