ప్రపంచ మానవ మరిణామం జరిగే క్రమంలో, అనేక మార్పులలో పౌరాణిక మౌఖిక గాధలు, జానపదకథలు తదితర జానపద కళారూపాలు ఆయా కాలాల నాటి సాంధిక సమజీవనంలోని విషయాలను అతికిస్తూ ఆభూతకల్పనలతో కాలానుగుణంగా మారుతూ ఎప్పటికి నిలచే ఉంటూ వచ్చాయి ఉంటాయికూడా. వీటికి ఆటవిక, గ్రామీణ వ్యవస్థలు పునాదులుగా నిలుస్తాయి. రామాయణ భారత, భాగవతాలు, బైబిల్ కథలు ఖురాన్ కథలు తదితర మతగ్రంధాలు పౌరాణికాలకు మూలంగానిలిస్తే అరేబియన్ నైట్స్ సింద్ బాద్ కథలు, బేతాళకథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, యిలా లనేక రచనలు మౌఖిక ప్రచారాలు జానపదాలకు మూలం.
ఈ నాటి కర్తవ్యం : ఉనికి ఉన్నంత వరకూ ఇవి సజీవాలే. వీటికి అన్నివైపులనుంచీ తగిన ప్రోత్సాహం లభిస్తే తిరిగి తిరిగి ఇంకా వికసిస్తూ ఈ నాటి సామాజిక దురవస్థలో కొంత మార్పు తెచ్చిపెడ్తాయి అని మా ప్రఘాడ నమ్మకం. ముందుగా సినిమాని, టి. వి. ని సంస్కరించాలి.