PRAGATI PRACHAR TV
ప్రగతి ప్రచార్ టీవీ
ప్రజా టీవీ Flash News 4       **       ప్రజా టీవీ Flash News 3             **       ప్రజా టీవీ Flash News 2       **             ప్రజా టీవీ Flash News 1          **
జీవితం - సాహిత్యం - సినిమా

మానవ జీవన వికాసానికి సాహిత్యం అడుగడుగునా ప్రధాన భూమిక పోషించింది . నాటకం బ్రతకాలన్న సంగీతం బ్రతకాలన్న, ఏ కళలు బ్రతకాలన్న, సాహిత్యం ప్రతి అడుగులో నిలిచియుంటుంది. కానీ నేడు బహుముఖంగా నీచపాత్ర పోషిస్తూ సంఘంలో దుర్గంధం వెదజల్లుతోంది. ఈనాటి సినిమా సాహిత్యం అది ఎదగడానికి సాహిత్యమే ప్రధాన మూలాధారం. అది ఎదిగి ఈ రోజు సాహిత్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికి సాగిస్తున్న ఘోరకలి అంతా ఇంతా కాదు. పత్రికా రంగం టీవీ మీడియా కూడా తోడై సినిమాతో జతకడుతూంది.

సాహిత్యం ఎందుకు చదువాలి ?

సాహిత్యం ఎందుకు చదవాలో స్పష్టంగా దాని నిర్వచనమే చెప్తుంది. సహితస్య భావః సాహిత్యమ్, అంటే హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది సాహిత్యం. సాహిత్యం చదివిన వారు మానవునిలో మాధవుణ్ణి చూడగలగాలి. ఏది హితం, ఎవరికి హితం అని ఆలోచిస్తే సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం అనుకోవాలి. ఇదే మరో రకంగా 'విశ్వశ్రేయః కావ్యమ్ ' అనాలి.

సాహిత్యం - సమాజం

"సహిత స్వభావః సాహిత్యం" "హితేనసహితం సాహిత్యం" - అంటే హితంతో కూడినది, హితాన్ని కూర్చేది సాహిత్యం. సకల విద్యలకీ తల్లి అయిన సరస్వతీదేవికి సంబంధించినది సారస్వతం, వాక్+మయం వాజ్మయం. అంటే వాక్కుతో కూడుకున్నది. ఇది కూడా సాహిత్యంతో కూడుకుని ఉన్నదే. పురాణాల్ని వాఙ్మయాలన్నారు. పురాణం, కవిత్వం, కథ, నవల, నాటకం, లేఖాసాహిత్యం, జానపద సాహిత్యం -ఇలా అంతా సాహిత్యమే.

హితాన్ని చేకూర్చేది, మేలుతో కూడినది సాహిత్యం అన్నప్పుడు - ఏది హితం ? ఎవరికి హితం? వీటికి సమాధానం కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, సమాజం చెందే పరిణామాల్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే "విశ్వశ్రేయం కావ్యం" అన్నారు.సమాజానికి మేలు చేకూర్చేది మాత్రమే ఉత్తమసాహిత్యం. అలాగే మధ్యమ సాహిత్యం, అధమ సాహిత్యం కూడా ఉన్నాయి. మధ్యమ సాహిత్యం సమాజానికి మేలు చేయకపోయినా, కీడు మాత్రం చేయదు. అధమ సాహిత్యం వాళ్ళ సమాజానికి మేలు మాట అటుంచి, కీడే జరుగుతుంది.చేతిలో కలం కదా అని ఏది బడితే అది వ్రాసి సమాజం మీదికి గుప్పించకూడదు. హింసనీ, టెర్రరిజాన్ని గొప్పగా చిత్రీకరించటం, బూతు సాహిత్యం, మొదలైన వాటిని విష సాహిత్యం అని అనవచ్చు. దీనివల్ల సమాజంలో - ముఖ్యంగా యువతలో - విలువలు, నీతి వర్తనము అన్నీ క్షీణించిపోతాయి. అలంటి పౌరులు అధిక శాతంలో కలిగి ఉన్న సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు.